Vivo గత నవంబర్‌లో ఆవిష్కరించిన తన లేటెస్ట్ మొబైల్స్ vivo X100 మరియు vivo X100 Pro లకు జనవరి 4న ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభించింది . ఈ కొత్త Vivo X100 మరియు Vivo X100 Pro సిరీస్ హ్యాండ్‌సెట్‌లు MediaTek యొక్క డైమెన్సిటీ 9300 SoCపై నడుస్తాయి. నీరు మరియు ధూళి నిరోధకత కోసం IP68-రేటెడ్ బిల్డ్ క్వాలిటీని కలిగి ఉన్నాయి. Vivo X100 Pro సిరీస్ ఫొన్ల ప్రధాన ఆకర్షణ అందులో పొందుపరిచినా కెమెరాలే. ఫోన్ వెనుక భాగంలో Zeiss టెక్నాలజీ తో పనిచేసే ట్రిపుల్ కెమెరాలను మరియు ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం Vivo యొక్క ఇమేజింగ్ చిప్‌ను పొందుపరిచారు. Vivo X100 Pro మోడల్ Sony IMX989 రకం ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. Curved 6.78 inch 8 LTPO AMOLED డిస్‌ప్లేలను కలిగి ఉన్న ఈ రెండు ఫోన్‌లు 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో ఆకట్టుకుంటున్నాయి .
Vivo X100 and vivo X100 Specifications
Information | Vivo X100 Pro | Vivo X100 |
---|---|---|
Display | 6.78-inch | 6.78-inch |
Processor | MediaTek Dimensity 9300 | MediaTek Dimensity 9300 |
Front Camera | 32-megapixel | 32-megapixel |
Rear Camera | 50MP(Sony IMX989) + 50MP(Ultra wide) + 50MP(APO super-telephoto ) | 50MP (Sony IMX989)+ 50MP(Ultra wide) + 64MP(super-telephoto ) |
RAM | 12GB/16GB | 12GB/16GB |
Storage | 256GB/512GB | 256GB/512GB |
Battery Capacity | 5400mAh | 5000mAh |
OS | Android 14 | Android 14 |
Resolution | 1260×2800 pixels | 1260×2800 pixels |
Processor
Vivo X100 Pro ఫోన్ Android14-ఆధారిత FunTouch OS 14పై నడుస్తుంది మరియు ఇది Vivo యొక్క కొత్త V3 ఇమేజింగ్ చిప్‌తో పాటు 16GB వరకు LPDDR5X RAM మరియు G720 GPUతో పాటు ఆక్టా-కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 9300 SoCపై పనిచేస్తుంది . Vivo X100 ఫోన్ Vivo V2 చిప్‌తో కూడిన 4nm MediaTek డైమెన్సిటీ 9300 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. మరియు ఫోన్ Android14-ఆధారిత FunTouch OS 14 ను కలిగి ఉంటుంది.
Display
Vivo X100 మరియు Vivo X100 Pro సిరీస్ హ్యాండ్‌సెట్‌లు 6.78-అంగుళాల సైజు తో AMOLED 8T LTPO కర్వ్‌డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి . 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేసే డిస్ప్లే 3000nits వరకు brightness ను కలిగి ఉంటుంది.
Camera
Vivo X100 Pro Rear Camera
Vivo X100 Pro ఫోన్ Zeiss బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ తో 50-మెగాపిక్సెల్ Sony IMX989 1-inch సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ Zeiss APO super-telephoto camera ను పొందుపరిచారు . ప్రైమరీ మరియు టెలిఫోటో కెమెరా రెండూ 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు .
Vivo X100 ఫోన్ కూడా Zeiss బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని మెయిన్ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ తో Sony IMX920 VCS బయోనిక్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే 64-మెగాపిక్సెల్ Zeiss super-telephoto camera ను పొందుపరిచారు . Vivo X100 ఫోన్ కూడా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
Battery
Vivo X100 Pro 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు Vivo X100 మోడల్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Vivo X100 Pro, Vivo X100 price in India
Vivo X100 pro కేవలం ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది, 16GB RAM మరియు 512GB స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర INR89,999. Vivo X100 ఆస్టరాయిడ్ బ్లాక్ మరియు స్టార్‌గేజ్ బ్లూ అనే రెండు రంగులలో రెండు భిన్నమైన మెమరీలతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క 12GB RAM మరియు 256GB స్టోరేజ్ మోడల్ ధర INR63,999/- కాగా 16GBRAM మరియు 512GB స్టోరేజ్ మోడల్ ధర INR 69,999/- గా నిర్ణయించారు.
Vivo X100 Pro, Vivo X100 availability / Vivo X100 Pro, Vivo X100 ఎప్పుడంటే
ఈ రెండు Vivo X100 సిరీస్ ఫోన్‌లు ప్రస్తుతం Flipkart లో ప్రీ-బుకింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి మరియు జనవరి 11 నుండి విక్రయించబడతాయి. SBI మరియు HDFC బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్‌లు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ మరియు రూ. 8,000 అప్‌గ్రేడ్ బోనస్ ను పొందవచ్చు.
- టాప్ 10 క్రిప్టోకరెన్సీ అపోహలు – నిజాలు | Top 10 Crypto Currency Myths Debunked
- క్రిప్టోకరెన్సీలు అంటే ఏమిటి…? ఎలా పనిచేస్తాయి..? | What is Crypto Currency and How it Works.. BITCOIN & ETHEREUM
- 5 Important Things to Do Right After Waking Up | ఉదయాన్నే లేవగానే చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు
- Unlocking the Power of ChatGPT: A Guide to Conversational AI Introduction | ChatGPT అంటే ఏమిటి ? ఎలా ఉపయోగించాలి ?
- Redmi Note 13 5G, Note 13 Pro 5G, Note 13 Pro Plus 5G Price and Specifications | Redmi Note 13 series ఫోన్ల ధర ఎంతో తెలుసా…. ?