తెలుగు సినిమాకు 2023 ప్రారంభం మరియు ముగింపు గొప్పగా ఉన్నాయనే చెప్పాలి . ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలు కొన్ని బ్లాక్బస్టర్ అయితే కొన్ని అవెరేజ్ గాను మరికొన్ని డిసాస్టర్ గాను మిగిలిపోయాయి. మరికొన్ని విమర్శకుల ప్రశంశలు అందుకున్నా ప్రేక్షకుల మనసు దోచుకోలేకపోయాయి. అయితే 2023 ముగింపులో మన తెలుగు సినిమా స్థాయి అల్ ఇండియా సినిమా తలదన్నేలా ఉందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు మనం 2023లో విజయాలు సాధించిన టాప్ తెలుగు సినిమాలు చూద్దాం.
List of Top Telugu Movies in 2023
10. Virupaksha
ఒక గ్రామంలో అనుమానాస్పదంగా జరిగే వరుస మరణాలకు సంబంధించిన హార్రర్ సినిమాగ వచ్చి ప్రేక్షకుల మన్ననలను అందుకుంది . సాయి దారం తేజ్ నటన మరియు దర్శకుడి ప్రతిభ ఆకట్టుకుంటాయి.
Stars: Sai Dharam Tej, Samyuktha Menon, Sunil
Director: Karthik Varma Dandu
9. BABY
ఈ సినిమాలో పాత్రాలు నిజజీవితానికి అత్యంత దగ్గరగా ఉంటాయి.దర్శకుడు సన్నివేశాలను యువతకు నచ్చే అంశాలతో మరియు కొంత బోల్డ్ గా తెరకెక్కించ్చారు. ఈ చిత్రం ముఖ్యం గా యువత లో బాగా సందడి చేసింది. ఈ చిత్రం అనేక విమర్శలను ఎదుర్కొని విజయం సాధించింది. బేబీ చిత్రం, ఈ మధ్య కాలం లో వచ్చిన ఒక కల్ట్ చిత్రం గా చెప్పొచ్చు.
Stars: Anand Deverakonda, Vaishnavi, Viraj Ashwin
Director: Sai Rajesh Neelam
8. Kushi
ఒక నాస్తిక కుటుంబంలో పెరిగిన అబ్బాయికి మరియు ఒక హిందూ సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన అమ్మాయికి మధ్య ప్రేమాయణం ఆధారంగా రూపొందిన చిత్రం. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న వీరికి మధ్యన జరిగే సన్నివేశాలు కొంతమేరకు బాగానే తీసిన చిత్ర క్లైమాక్స్ పెదగా ఆకట్టుకోదు. ఓవరాల్ గా ఈ చిత్రం యువతకి బాగానే నచ్చింది.
Stars : Vijay Deverakonda, Samantha Ruth Prabhu , Saranya
Director: Shiva Nirvana
7. Tiger Nageshwar Rao
1970 lలలో ఆంధ్రప్రదేశ్ లో గల స్టూవర్టుపురం అనే గ్రామం లో ఉండే దొంగలలో ఒకడైన టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా అన్ని కమర్షియల్ అంశాలతో రూపొందిన చిత్రం. కొత్త దర్శకుడైనా రవితేజ కెరీర్ లో నిలిచిపోయేలా మలిచాడు.
Stars : Ravi Teja, Anupam Kher, Gayatri Bhardwaj
Director : Vamsee
6. Dasara
తెలంగాణ ప్రాంతం లోని సింగరేణి బొగ్గు గనులలో గల వీర్లపల్లి అనే గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు అక్కడ జరిగే రాజకీయ కార్యకలాపాలకు మధ్య తీసిన సినిమా. సినిమా చాల రియలిస్టిక్ గా ఉండడం తో పాటు కథ కథనం బాగుండడం తో భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో వెన్నెల పాత్రలో నటించిన నటి కీర్తి సురేష్ కు మంచి గుర్తింపు వచ్చింది.
Stars: Nani, Keerthy Suresh, Shine Tom Chacko
Director : Srikanth Odela
5. Bhagavanth Kesari
ఆడపిల్లలను ధైర్యంగా సింహాల్లా పెంచాలి అనే సామాజిక సందేశం తో వచ్చిన ఈ చిత్రం దసరా పండగ సందర్బంగా విడుదలై ప్రేక్షకుల మన్ననలను పొందింది. బహుశా బాలకృష్ణ కెరీర్లో హీరోయిన్ తో పాటలు లేకుండా వచ్చిన మొదటి సినిమా.ముఖ్యానంగా బాల్లయ్య బాబు , శ్రీలీల నటన మరియు వారి మధ్య సన్నీ వేషాలు ఆకట్టుకుంటాయి.
Stars : Nandamuri Balakrishna, Sreeleela, Arjun Rampal, Kajal Aggarwal
Director: Anil Ravipudi
4. Balagam
తెలంగాణా ప్రాంతం లోని ఒక మారుమూల గ్రామంలో ఒక ఇంట్లో పెద్దమనిషి చనిపోయిన తర్వాత జరిగే సంఘటనల ఆదారంగా తీసిన చిత్రం. ముఖ్యంగా నటీనటుల నటన , సంగీతం మరియు చిత్ర క్లైమాక్స్ హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది. రక్త సంబంధీకుల మధ్య ఎన్ని ఇబ్బందులున్నా అందరూ ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతలతో ఉండాలనే చిత్ర కాన్సెప్ట్ అందరికి చేరువైంది దర్శకుడు వేణు తీసిన ఈ సినిమాని , తెలంగాణా లోని దాదాపు అన్ని గ్రామాల్లో , ప్రాంతాల్లో బహిరంగంగా చిత్ర ప్రదర్శన చేశారు అంటే ప్రజల హృదయాలకు ఎంత చేరువైందో అర్ధం చేసుకోవచ్చు.
Stars: Priyadarshi , Kavya Kalyanram , Kethiri Sudhakar Reddy
Director: Venu Yeldandi
3. Veerasimhareddy
వీరసింహా రెడ్డి ఒక గ్రామంలో పూజ్యమైన వ్యక్తి ., అతని భర్య అతని కుమారుడు జైసింహా రెడ్డి ని అతనికి దూరంగా పెంచుతుంది. తన తండ్రి గ్రామ రాజకీయాలలో తన మేనత్త సహకారంతో చంపబడినప్పుడు, జై సింహా భారతదేశానికి తిరిగి వచ్చి తన తండ్రిని చంపిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.రెండు పాత్రల్లో బాలకృష్ణ నటన ఆకట్టుకుంటుంది. సంక్రాంతి పండక్కి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది.
Stars: Nandamuri Balakrishna, Shruti Haasan, Honey Rose
Director: Gopichand Malineni
2. Valtheru Veerayya
వాల్తేరు వీరయ్య ఒక పోలీస్ ఆఫీసర్ తో అంతర్జాతీయ డ్రగ్ డోన్ ను పట్టుకోవడానికి మలేషియా వెళ్తాడు. అక్కడ ఆ మాఫియా డాన్ తో తన గతానికి సంబంధించి కొన్ని విషయాల కారణంగా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. రవితేజ చిరంజీవి ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అన్ని కమర్షియల్ హంగులతో తీసిన ఈ చిత్రం అశేష విజయం సాధించింది.
Stars: Chiranjeevi, Ravi Teja, Shruti Haasan
Director: K.S. Ravindra
Top Movie of the Year 2023
1. Salaar
2023 చివరిలో వచ్చిన ఈ చిత్రం విశేష ఆదరణతో విడుదలైన అన్ని భాషలలో విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది. ప్రభాస్ , పృథ్వీ రాజ్ ల నటన ప్రశాంత్ నీల్ దర్శకత్వం నేపథ్య సంగీతం మరియు ఆక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సినిమాను సైతం తట్టుకొని అంతకు మించి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. గత సంవత్సరం RRR లాగే ఈ సంవత్సరం కూడా తెలుగు చిత్రమే దేశంలో ప్రభంజనం సృష్టించడం గర్వించ దగ్గ విషయం.
Stars: Prabhas, Prithviraj Sukumaran, Shruti Haasan
Director: Prashanth Neel
MAD , హాయ్ నాన్న , విమానం, ఉగ్రం, సమజవరాగమన, రంగమార్తాండ మరియు మరిన్ని చిత్రాలు ప్రేక్షకాదరణ పొందినా టాప్ 10 లో చోటు సంపాదించలేక పోయాయి. ఇది కేవలం ఆయా చిత్రాలు సాధించిన కలెక్షన్స్ మరియు ప్రజాధారణ ఆధారంగా రుపొందించినది.
- టాప్ 10 క్రిప్టోకరెన్సీ అపోహలు – నిజాలు | Top 10 Crypto Currency Myths Debunked
- క్రిప్టోకరెన్సీలు అంటే ఏమిటి…? ఎలా పనిచేస్తాయి..? | What is Crypto Currency and How it Works.. BITCOIN & ETHEREUM
- 5 Important Things to Do Right After Waking Up | ఉదయాన్నే లేవగానే చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు
- Unlocking the Power of ChatGPT: A Guide to Conversational AI Introduction | ChatGPT అంటే ఏమిటి ? ఎలా ఉపయోగించాలి ?
- Redmi Note 13 5G, Note 13 Pro 5G, Note 13 Pro Plus 5G Price and Specifications | Redmi Note 13 series ఫోన్ల ధర ఎంతో తెలుసా…. ?