ప్రభాస్ , నాగ్ అశ్విన్ ల KALKI 2898 AD చిత్ర ట్రైలర్ ఎప్పుడంటే…..? | Prabhas’s KALKI 2898 AD Trailer Update

ప్రస్తుతం సలార్ పార్ట్-1 Ceasefire చిత్ర భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న KALKI 2898 AD చిత్రం ట్రైలర్ మరియు విశేషాలను చిత్ర దర్శకుడు ఒక ఈవెంట్ లో పంచుకున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కి భారీ స్పందన రావడం తో చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

KALKI 2898 AD ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..

ఐఐటి బాంబేలో జరిగిన టెక్ ఫెస్ట్ 2023 లో పాల్గొన్న నాగ అశ్విన్ , అక్కడ ప్రభాస్ మరియు దీపికా పడుకోన్ లతో తానూ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం KALKI 2898 AD గురించి కొన్ని థ్రిల్లింగ్ వార్తలను పంచుకున్నాడు. ప్రేక్షకులతో తన ఇంటరాక్షన్ సందర్భంగా, దర్శకుడు పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD యొక్క ట్రైలర్‌ను ఈ రోజు నుండి ఖచ్చితంగా 93 రోజుల పాటు అంటే ఏప్రిల్ 1, 2024న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

KALKI 2898 AD మరో STARWARS లాంటి చిత్రామా…?

ఒక విద్యార్థి కల్కి 2898 AD, అంతర్జాతీయ ప్రముఖ ఫ్రాంచైజీ STARWARS లాంటి చిత్రమా అని అడుగగా , దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. తాను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వైవిధ్యమమైనదని మరియు ఇది భారతదేశం యొక్క ప్రాజెక్ట్ K (India’s Project K), భారతదేశం యొక్క కల్కి(India’s KALKI) అని తెలిపారు .

వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం లో వివిధ చిత్ర పరిశ్రమల నుండి ప్రముఖ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, పశుపతి మరియు ఇతర తారాగణం ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు సంతోష్ నారాయణ నేపథ్య సంగీతం అందిస్తున్నారు .

Teaser of KALKI 2898 AD

Leave a comment